
మనసు ని వెన్నెల లా చేసి చూడు...
జీవితం మనం అనుకోనేంత 'చిక్కుముడి' కాదు!
మన నెత్తి మీద బండ రాళ్ళు ఏమి లేవు..
మన చుట్టూ మనకు మనమే గీసుకున్న లక్ష్మణ గీతలు తప్ప...!!
మన' రంగుల కలలే 'మనకు భారం కాకూడదు ,
చితాకోక చిలుక ని చూడు ..రంగుల దుప్పటి కప్పుకొని ఎంత స్వేచ్చగా ఎగురుతుందో!!
మనం ఎవరికోసమో ఎదురు చూడటం మన అవివేకం !
'గడ్డి పువ్వు'ని చూడు ..దేవుడి పూజకు పనికి రాకున్నాఉదయ కాలపు మంచు లో ఎలా మెరిసిపోతుందో !!
జీవితం లో దేనినీ ఆశించ వద్దు ....శాసించు !!
నీవు కోరుకున్న జీవితం ..నీ కాళ్ళ ముందు మోకరిల్లుతుంది ..!
2 కామెంట్లు:
శ్రీను గారు , శుభంగా గణేశుడ్నిప్రార్ధిస్తూ బ్లాగ్ మొదలు పెట్టారు . మీటపాలు బావున్నాయి :) ఇలాగే నిరాటంకంగా కొనసాగించాలని కోరుకుంటున్నాను.ఆల్ ది బెస్ట్ !
పరిమళ గారు !మీకు ధన్యవాదములు.నా బ్లాగుని తాకిన మొదటి పరిమళం {టపా }మీదే .
నేను చేసే గుమస్తా గిరి తో నా లో భావుకత ఏనాడో ఇంకి పోయింది అండీ..మీ లాంటి వాళ్ళ ప్రోత్సాహం తో , ఆశీస్సుల తో ..నా లో ఏ మూలైన దాగి ఉన్న తేమని వెతికి పట్టుకోవాలన్న చిన్న ప్రయత్నమే ....ఈ బ్లాగు .నా మనవి ఆలకిస్తారని ఆశ తో ....
కామెంట్‌ను పోస్ట్ చేయండి