15, మార్చి 2010, సోమవారం

ఉత్తరం -1



స్వచ్చమైన పల్లె నుంచి టౌన్ కి వలస వచ్చిన ఒక పల్లెటూరి పాపయ్య పడే మానసిక సంఘర్షణ ని
మనో భావాలను అక్షరీకరించే చిన్న ప్రయత్నమే ఈ "ఉత్తరాలు ".



ప్రియాతి ప్రియమైన మిత్రుడు...
లక్కిం శెట్టి సూరి బాబూ కి నీ మిత్రుడు చెవుడు బావుల ముని మాణిక్యాల రావు రాయునది ఏమనగా ..
నేను క్షేమం .నీవు అక్కడ క్షేమమని తలుస్తున్నాను .

ఒరేయ్ మామ ..నేను హైదరాబాద్ లో దిగినవెంటనే .
నీకు ఉత్తరం రాద్దాము అనుకున్నాను ..కానీ కుదరలేదు..!
ఎందుకంటే ...ఇక్కడ పోస్టు డబ్బాలు మన ఉళ్ళో లా పక్కనే ఉండవు రా!.
అది వెతికే సరికి ఇన్ని రోజులు పట్టింది .

పోనీ ఫోన్ చేసి మాట్లాడదామంటే ...
ఉత్తరం రాయడం లో వచ్చే ఆనందం ,చదవడం వల్ల కలిగే అనుభూతి ఎంత సేపు ఫోను మాట్లాడితే వస్తుంది చెప్పు !!

ఒరేయ్ ..సూరి గే నీకు హైదరాబాద్ విషయాలు చాలా చెప్పాలి రా .
ముందుగా నా 'కడుపు మంట' గురుంచి ...
వినే వాళ్ళకి కాస్తంత విడ్డురం గా ఉంటుందేమో కానీ ..పీత కష్టాలు పీత వి లా ఇది కూడా నాకు కూసింత పెద్ద కష్టమే !

నేను ఎల్లిన తోలి రోజే ..
పొద్దునే లేచి పొల్లు తోముకుని ...టిపిను చేద్దామని బయటకు వెళితే..
మన ఉళ్ళోని కాఫీ హొటేలు వెంకటరాజు బడ్డి కొట్టు లాంటిది ఒక్కటి కుడా తగల లేదు రా !!
నా బాధ ఎవరి కి చెప్పుకోవాలి ?కడుపు లో ఒకటే ఆకలి కేకలు !

మేముండే వీధి కి కూసింత దూరం లో ఏదో "హై- టెక్ "టీ పాయింట్ అని ఉంటె చూద్దాం కదా అని..వెళ్ళా !
అక్కడ వట్టి సమోసాలు ,బన్ను రొట్టెలు తప్ప ఇంకేమి లేవు !అదేదో 'ఇరానీ హొటేలు' అంట!

మర్నాడు మా రూం లో కుర్రాడొకడు ,పక్క వీధి లో మన సైడు హొటేలు ఉందని చెప్తే హుషారు గా చేతులూపు కుంటా వెళ్ళా !
ఎంగిలకుల పై ఎగబడ్డ కాకుల్లగా కుమ్ము కుంటున్నారు అక్కడ !
వాళ్ళ తో మనకేం పని లే అనుకొని నేను వెళ్లి దర్జా గా కుర్చీలో కుచ్చోని "ప్లేటు ఇడ్లీ "అని ఆర్డరు వేశా..!
మనల్నిఎవడు పట్టించుకోలేదు !

నా పక్కనే కూచున్న ఇంకొకాయన ,కౌంటర్ లో టికెట్ తీసుకొని నన్ను కూడా ఆ గుంపులో కి ఎగబడమన్నాడు.
యిదేమి కర్మరా బాబూ అనుకోని...టికెట్టు ఒకటి తీసుకోని జనం మద్యలో కి దూరేశాను..
ఎలాగైతే ..అష్ట కష్టాలు పడి ప్లేటు ఇడ్లీ సంపాయించాను .
ఆ హడావిడి లో ప్లేటులో ఎన్ని ఇడ్లీ లు ఉన్నాయో కూడా చూసుకోలేదు .

చాలా హాపీ గా ఫీలైపోయి..
నా టేబుల్ దగ్గర కొచ్చి తినబోతే ...నా ప్లేటు లో ఒకటే ఇడ్లీ ఉంది !
అడిగితే ..ఇక్కడ ప్లేటు కి రెండు ఇడ్లీ లే యిస్తారంట,ఇంకోటి ఆ జనం మద్యలో పడిందేమో వెతుక్కోమన్నాడు.
మరి 15 /- ఎందుకు తిసుకున్నావని అడిగా ..
మా మన వెంకటరాజు ఐతే 10- రుపాయిలకే అరచేయ్యంత ఇడ్లీలు నాలుగు పెడతాడు కదా !ఇవేమో దీపావళి ప్రమిదలంత కూడా లేవు . అందుకే నిలదీసి అడిగేశా ..
పిచ్చోడిని చూసినట్టు చుశాడురా ..
నాకు పెద్ద అవమానం అనిపించేసి ,కడుపు మండి వచ్చేసా ..

అంతే!ఆ రోజు మొదలు ఈ రోజు వరకూ..
"కుర్చీలో దర్జా గా కూర్చొని ,కొబ్బరి చెట్నీ లో ..ఇడ్లీ నంజుకుంటూ .మద్య మద్య లో నెయ్యి వేసిన కారప్పొడి ని అద్దుకుంటూ కడుపు నిండా తినేసి ఆరాం గా బొజ్జ నిమురుకోవాలన్న "చిన్ని కోరిక కూడా అలాగే ఉండి పోయిందిరా.

ఇలాంటి చిన్ని చిన్ని కోరికలు కూడా తీరవురా ఇక్కడ !!
ఇవన్నీ వినడాని కి చిన్నివే రా ..మనసు కి మాత్రం బోలెడంత కష్టం !
నా లాంటోడు బ్రతకాలంటే చానా కష్టం !

ఒరేయ్ మామా ..ఇలా చెపుతూ ఉంటె ఇలాంటి వి ఇక్కడ చాలా ఉంటాయి రా ..
నేను మళ్లీ ఉత్తరం లో అన్నీ రాస్తాను కానీ ..ఊళ్ళో మనోళ్ళంతా జాగ్రత్త .

2 కామెంట్‌లు:

భాస్కర రామిరెడ్డి చెప్పారు...

"కుర్చీలో దర్జా గా కూర్చొని ,కొబ్బరి చెట్నీ లో ..ఇడ్లీ నంజుకుంటూ .మద్య మద్య లో నెయ్యి వేసిన కారప్పొడి ని అద్దుకుంటూ కడుపు నిండా తినేసి ఆరాం గా బొజ్జ నిమురుకోవాలన్న "

ఇది చిన్నకోరిక అంటారేంటండి :)

శ్రీను .కుడుపూడి చెప్పారు...

భాస్కర రామి రెడ్డి గారు !ముందుగా మీకు నా దన్యవాదములండి.
వినేవాళ్లకు అది చిన్న విషయమే కానీ ...ఆ కాంబినేషన్ మిస్ అయిన మీ లాంటి వాళ్ళకి నా లాంటి వాళ్ళకి పెద్ద కోరికే కదాండీ!

భోగిమంట- కథ (సాక్షి ఫన్ డే )

సంక్రాంతికి సొంతూరు అమలాపురం బయలుదేరాము హైదరాబాద్ నుండి. కూకట్ పల్లి బస్టాప్ లో నిలబడ్డాం బస్సుకోసం.పండగ సందడిని పొట్లం కట్టుకుని నింగికి దూ...