20, జూన్ 2011, సోమవారం

నిజాలు

మనసు ని వెన్నెల లా చేసి చూడు...జీవితం మనం అనుకోనేంత 'చిక్కుముడి' కాదు!




మన నెత్తి మీద బండ రాళ్ళు ఏమి లేవు..మన చుట్టూ మనకు మనమే గీసుకున్న లక్ష్మణ గీతలు తప్ప...!!






మన' రంగుల కలలే 'మనకు భారం కాకూడదు ,చితాకోక చిలుక ని చూడు ...రంగుల దుప్పటి కప్పుకొని ఎంత స్వేచ్చగా ...ఎగురుతుందో!!






మనం ఎవరికోసమో ఎదురు చూడటం మన అవివేకం !-

'గడ్డి పువ్వు'ని చూడు ..దేవుడి పూజకు పనికి రాకున్నాఉదయ కాలపు మంచు లో ఎలా మెరిసిపోతుందో !!






జీవితం లో దేనినీ ఆశించ వద్దు ....శాసించు !!

నీవు కోరుకున్న జీవితం ..నీ కాళ్ళ ముందు మోకరిల్లుతుంది ..!

25, ఫిబ్రవరి 2011, శుక్రవారం

అక్షరం కన్నీరొలికిన వేళ ..























ముళ్ళపూడోరి కలం ఆగిపోయింది .

బాపు గుండె కి చిల్లు పడింది .
కాలం ఆగిపోలేదు గానీ

అక్షరం కన్నీరొలికింది i

అరె !అక్షరాలు ఏడుస్తాయా?

ఏమో !నాక్కూడా ఇప్పుడే తెలిసింది .

24, జనవరి 2011, సోమవారం

సంక్రాంతి


సంక్రాంతి ..!
కళ్ళాపి చప్పుళ్ళు ..రంగు ముగ్గులు ,
బోగి మంటలు ..గొబ్బి పాటలు ,
వాలు జడలు ..వార చూపులు ,
ముద్ద బంతులు ..వరి కంకులు ,
హరి దాసులు ..డూ డూ బసవన్నలు ..
పల్లెలోని సంక్రాంతి సందళ్ళు !

పట్నం బ్రతుకులో ..మిస్సయి ఎన్నాళ్లైందో ..

ఈ అందాలూ ..అనుభూతులు !!

పప్పు చెక్కలు ..పాకం అరిసెలు ,

జంతికలు ..కజ్జికాయలు ..తీపి గారెలు ,
చిరుతిళ్ళు కావవి ...సంక్రాంతి పండక్కి ,
కొడుకు ఇంటికి రాలేదని ..పట్నం బస్సు కి
మా అమ్మ పొట్లం కట్టిచ్చిన "ముద్దులు -మురిపాలు ".

వాటిని చూస్తే ..

నా నోట్లో నీళ్ళురుతాయి!
ఆ వెంటనే ..కళ్ళల్లో నీళ్ళు తిరుగుతాయి !!


నోట్ :ఊరినుండి అమ్మ,అత్తయ్యలు పంపిన జంతికలు ..

అరిసెలు చూశాక ..నా మనసు లోనుండి కురిసిన 'ముత్యపు చినుకు 'లివి !
ఈ పోటో మాత్రం నాది కాదండోయ్ .

భోగిమంట- కథ (సాక్షి ఫన్ డే )

సంక్రాంతికి సొంతూరు అమలాపురం బయలుదేరాము హైదరాబాద్ నుండి. కూకట్ పల్లి బస్టాప్ లో నిలబడ్డాం బస్సుకోసం.పండగ సందడిని పొట్లం కట్టుకుని నింగికి దూ...