26, ఆగస్టు 2010, గురువారం

అక్షరం



అక్షరం !

నాకు అక్షరం తో అనుబంధం ఎప్పుడు మొదలైందో తెలీదు..
మా అమ్మ ఒడి లో ఊగుతూ జోగుతూ ఓనమాలు దిద్దినపుడనుకుంటా!
ఉహ తెలియని వయసులో ...
పాపం !అక్షరాన్ని నేను పట్టించుకోకపోయినా ,తను నన్ను పట్టించుకుంది -అమ్మలా !

అప్పుడు -నా చిన్నప్పుడు అల్లరి గా ,ఒంకర టింకరగా ..తనని నేను కెలికి అలికేసినపుడు ..
తను ఫీలవలేదు..అమ్మ తో నా బుగ్గ మీద మురిపం గా 'ముద్దు 'మార్కు లేయించింది .
బళ్ళో మేస్టారు బెత్తం తో నన్ను బెదిరించినపుడు ..అంతా 'తన 'వల్లే అని అలిగి ఓ మూలకి విసిరేసినపుడైనా తన కి కోపం రాలేదు ...అడిగితే మళ్లీ ఆప్యాయం గా తన అక్కున చేర్చుకుంది .

అంతేనా ?!

తనని చిత్తు కాగితాల మీద చిందర వందరగా జల్లేసి ..నా పని అయిపోయాక ఉండ చుట్టి 'డస్ట్టు బిన్ను' లోకి నొక్కేసినా ..కిక్కురు మనలేదు!
నా అర్ధ సంవత్సర పరీక్షల్లోనూ..ఆఖరి 'గండం' లోనూ నా" అక్షరం " పస్టు క్లాసులో పాసై పోయేది ..తన కోసం కాదు- నా కోసం !!
అయినా నాన్న కి నేను చెప్పేవాడిని కాదు ..అతని కళ్ళల్లో మెరుపు కి ఆ అక్షరమే కారణమని !
నేనెంత స్వార్ధపరున్ని?!

అన్నాళ్ళు అక్షరం తో సహా జీవనం చేసిన నేను ,సహవాసం చెయ్యాలనిపించింది మాత్రం..
మా తెలుగు మాస్టారు గొంతులో పరవశం తో తను పధ్యమై ..గధ్యమై కురిసినపుడే కదా !

ఓ చల్లని సాయంత్రం ...
నా మనసులో ని మాట బయటపెట్టాను - తను చిన్ని 'కవిత' యై నవ్వింది .
అరె ! అక్షరం లో అంతటి అందం నేనెప్పుడు చూడనేలేదు .

అప్పుడు -నా చిన్నప్పుడు నా ప్రియ మిత్రుడు నన్ను విడిచి అనంత తీరాలకి వెళ్లిపోయినపుడు..
ఆనాడు నా డైరీ లో కన్నీటి వరదై కురిసి "కన్నీటి జ్ఞాపకమై " నిలిచి పోయింది కూడా ఈ అక్షరమే !!.
నేనెప్పుడు అక్షరం లో ఇంతటి 'ఆర్ధ్రత' ఉంటుందనుకోలేదు !!

అక్షరం కేవలం అక్షరమే కాదు ..అనంత మానవ కోటి బరువు భాద్యతలని భుజానికెత్తుకున్న ఐరావతం !
అయిన వాళ్ళు వదిలేసి వెళ్ళిపోతున్నా...'నీ తో నేను ఉన్నానంటూ' ఆలింగనం చేసుకునే 'ఆత్మీయ బంధం '.
చివరికి ..నేను విరచించిన ఈ అక్షరమే ..నన్ను నేను త్యజించి అదృశ్యమైపోతున్నపుడు కూడా ..
నా ఆత్మని తనలో బందించి జన హృదయాలలో కథ యై ,కవితై 'నన్ను 'నిత్యం బ్రతికిస్తూనే ఉంటుంది .


రూపు మారినా భావం మారని ఈ అక్షరం కేవలం అక్షరమే కాదు ..అనంతం !
అంతే లేని మానవకోటి అనంత భావాలకి 'ప్రతి రూపం '.

7 కామెంట్‌లు:

భాను చెప్పారు...

really i enjoyed your post

శిశిర చెప్పారు...

చాలా బాగా రాశారు. మంచి టాలెంట్ ఉందండి మీలో. మళ్ళీ మీరు అడగకుండానే కామెంట్ పెట్టేస్తున్నాను. :)

Unknown చెప్పారు...

శ్రీను గారూ,
చాలా అద్భుతమైన భావన...
మదిలోని భావాన్ని తెలిపే అక్షరానికి నీరాజనం,
అక్షరలక్షల విలువైన భావోద్వేగం...
అభినందనలు..

శేఖర్ పెద్దగోపు చెప్పారు...

Excellent....చాలా చాలా బాగా రాసారు...

శ్రీను .కుడుపూడి చెప్పారు...

@Bhanu garu: Thank u sir.

@Sishira garu:chalaa thanka andi.meeru nannu managa chettu yekkistunnaru.

@Usha kiran garu: Thanks andi.regular gaa naa posts chadivi comments rastunamduku naku chalaa happy gaa undadndi.

@Shekar garu: Chala thanks andi.naa blog lo mee comment chuste naku chalaa energy vastundi.

వాజసనేయ చెప్పారు...

అక్షరం నాశనం లేని శబ్దానికి రూపం. ఇదే వేదం
చాల బాగుంది మీ రచన

శ్రీను .కుడుపూడి చెప్పారు...

@VAJASANEYA:ధన్యవాదాలండి

భోగిమంట- కథ (సాక్షి ఫన్ డే )

సంక్రాంతికి సొంతూరు అమలాపురం బయలుదేరాము హైదరాబాద్ నుండి. కూకట్ పల్లి బస్టాప్ లో నిలబడ్డాం బస్సుకోసం.పండగ సందడిని పొట్లం కట్టుకుని నింగికి దూ...