13, నవంబర్ 2010, శనివారం

మన 'బొట్టు' చెరిగిపోతుందా?!



మా నాయనమ్మ పేరు సీతా మహాలక్ష్మి .నేను పుట్టకముందే చనిపోయింది ఆవిడ.
నాకు ఆవిడ ని చూసే భాగ్యం లేదు కానీ ..ఆవిడ 'సౌభాగ్యం' గురుంచి మా ఊరి జనాలు గొప్ప గా చెబుతుంటే ..ఇప్పటికీ విని మురిసిపోతాను .
'పిల్లోడా!నీవు మీ నానమ్మ ని చూడలేదు గానీ..మహా తల్లీ !రూపాయి కాసంత బొట్టు ఎట్టుకుని..తలనిండా పూలు ఎట్టుకుని సాక్షాత్తూ..సీతమ్మ తల్లీ లా కళ కళ్ళాడతా తిరిగేదనుకో ..."అంటూ మా నాయనమ్మ ని కళ్ళ తో చుసిన వాళ్ళు కళ్ళని ఇంతలేసి చేసి చెబుతుంటే ..నా మనసుకి చాలా భాదైపోయేది. ఆ మహా తల్లి ని నేను ఎందుకు చూడలేక పోయానా..అని !
నా చిన్నతనం లో మా ఇంట్లో ఉండే ఒక్క బ్లాక్ &వైటు పోటో కూడా చెద పట్టేసి పాడై..నాకు ఉహ తెలిసే సరికి ఆమె రూపం నా మెదడు లో నిక్షిప్తమైపోకుండానే మాయమైపోయింది .

టివి ల్లో ఏ ఎమ్.ఎస్ .సుబ్బలక్ష్మి గార్నో .సుష్మ స్వరాజ్ గార్నో చూసినప్పుడల్లా ,రూపాయి కాసంత బొట్టు తో అచ్చం మా నాయనమ్మ ఇలానే వెలుగుపొతూ ఉండేదేమో అనుకోవడం తప్ప ,వేరే భాగ్యం లేకుండా పోయింది నాకు!
ఆడవాళ్ళ కి బొట్టు ఎంత అందాన్ని ఇస్తుందో ..ఆ మహా తల్లుల ముఖారవిందాల్నిచూస్తూనే అర్ధమౌతుంది .
మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకి చిహ్నం గా మెరిసే 'బొట్టు' కి మన జీవన సరళి లో ఒక ప్రత్యెక స్థానం !
రాజు ల కాలం లో ..యుద్దానికి వెళ్ళేటప్పుడు' వీర తిలకం' దిద్ది సాగనంపెవారట !
బొట్టు అలంకారమే కాదు..ఒక భరోసా కూడా!
భక్తుడు కుంకుమ నుదుటన దిద్దినా..భార్య తిలకం దిద్దినా ...వీరుడి కి వీర తిలకం దిద్దినా ..ఆ 'బొట్టు' ఓ చల్లని చెయ్యి మనకి చేదోడు గా ఉన్నదన్న ధైర్యాన్ని ఇస్తుంది !
మా అమ్మ కూడా పొద్దు పొద్దున్నే నిద్ర లేచి ,నుదుటున రూపాయ కాసంత కాకపోయినా ..పావలా బిల్లంత తిలకం దిద్ది ఆపై కుంకుమ అద్ది ..అచ్చం లక్షి దేవి లా మెరిసిపోతుంది .
నా కంటే ముందే నిద్ర లేచి 'సూర్య బింబాన్ని' నుదుటున అలంకరించుకునే అమ్మని బొట్టు లేకుండా చూడటం ..నా చిన్న తనం నుండి ఇప్పటికీ వరకూ ఒక్కసారి కూడా తటస్థ పడలేధంటే ..అతిశయోక్తి కాదు .ఇప్పటికీ ప్రతి రోజు అంతే శ్రద్దగా భక్తి గా ఆ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తుంది అమ్మ .
మా అమ్మ ఒక్కరే కాదు.. కొన్ని సంత్సరాల క్రితం నాటి 'అమ్మలు' అందరూ అంతే ..ఎంతో భక్తి శ్రద్దలతో 'తిలక ధారణ' చేస్తారు .
కానీ ఈ మద్య కాలం లో కొంత మంది 'అమ్మల' కి మాత్రం బొట్టు ఒక అలంకారం మాత్రమే ...
ఈ కాలం అమ్మాయిలకైతే ...బొట్టు ఒక 'ఎబ్బెట్టు'!
మొన్నీ మద్యనే మా ఊళ్ళో కొంత మంది ఆడవాళ్లు 'మత మార్పిడి' పేరిట నుదుటన బొట్టు ని నిర్ధాక్షిణ్యం గా చెరిపేసుకున్నారు.

ఇలాగే సాగితే ...
కాలక్రమం లో భరత మాత నుదుట పైన మన సౌభాగ్యపు 'బొట్టు' చెరిగిపోతుందా?
మన తరువాత తరాల పిల్లలకి మన సాంప్రదాయక బొట్టు,పాఠ్య పుస్తకాలలో ఒక 'చరిత్ర పాఠం' గానే మిగిలిపోతుందా ?!ఏమో !

20 కామెంట్‌లు:

రాజేష్ జి చెప్పారు...

హ్మ్.. బాగా చెప్పారు.. బొట్టు గురించి.. మీ నాయనమ్మ గారి జ్ఞాపకాలతో.

బొట్టు/తిలకం : ఒక పవిత్రమిన భావనకి సంకేతం. మగ/ఆడ ఎవరైనా పెట్టుకోవచ్చ్చు. ఇంకా ఆడువారి అందాన్ని మరి౦త ద్విగుణీకృతం చేస్తుంది.

అన్నదానం చిదంబరశాస్త్రి గారు ఆ బొట్టు వెనకవున్న సైన్స్ ని ఆధ్యాత్మికతతో కలగలిపి చెప్పారు. నాకు సమయానికి బుర్ర పనిచేయదు. గూగులమ్మ ఏమైనా చెబుతుదేమో చూసి చెప్తా..

$"మన 'బొట్టు' చెరిగిపోతుందా?!"
అవుననే అనుకుంటా. ఇప్పుడు బొట్టు కట్టు రంగుని బట్టి ఉంటుంది. అంతా రంగులమయం.. పైనుంచి కింద దాకా అంతా మాచింగ్ :). అంతా రసాయనాల పిచికారి.

$మా ఊళ్ళో కొంత మంది ఆడవాళ్లు 'మత మార్పిడి' పేరిట నుదుటన బొట్టుని నిర్ధాక్షిణ్యంగా చెరిపేసుకున్నారు

చాలా బాధ వేస్తుంది. బొట్టు ఒక్క హిందూ ధర్మానికి మాత్రమె కాకుండా, భారతీయతకి కూడా గుర్తు అనుకుని కేరళ వాళ్ళని అన్నా అనుసరిస్తే బావుంటుంది.

శ్రీను .కుడుపూడి చెప్పారు...

@రాజేష్ .జి గారు !మీ స్పందనకి నా ధన్యవాదాలు .
నాకు అన్నదానం చిదంబర శాస్త్రి గారి గురుంచి తెలీదు ..అయన గురుంచి సమాచారం ఎక్కడ దొరుకుతుంది ?
మీ దగ్గర సమాచారం ఏమైనా ఉంటే నాకు పంపించమని మనవి .



@ఎస్ ఎన్ కే ఆర్ గారు !మీకు ధన్యవాదాలు .
ఏదో నా మనసులోని భావనని ,బాధ ని అక్షర రూపం లో పెట్టాను గానీ ..బొట్టు రకాల మీద వ్యాసం రాసేంత జ్ఞాని ని కాదండి .నా భావాల తో ఏకీభవించే మీలాంటి వారు ఉన్నందుకు చాలా సంతోషం గా ఉంది.మీరు ఏమైనా కొంత సమాచారాన్ని ఇస్తే..దానికి నాకు తెలిసింది కొంత జత చేసి ఏమైనా రాయగలుతానేమో!-:)

రాజేష్ జి చెప్పారు...

@తువ్వాయి

బాగుందండీ పేరు.. అదే తువ్వాయి :)

ఇక శాస్త్రి గారిని ఇక్కడ కలవవచ్చు http://srihanumanvishayasarvasvam.blogspot.com/ ఆయన రాసిన "హిందూ ధర్మ సర్వస్వం" లొ తిలకం/బొట్టు ధారణ గురించిన ప్రస్తావన చాల బాగా వివరించారు. ఇంకా అందులొ రకాలు కూడా. మీ బాధ నా బాధ కూడా.

ఇక చివరిగా ఒక రాయి,

$..బొట్టు రకాల మీద వ్యాసం రాసేంత జ్ఞాని ని కాదండి ..
హహ్హా మాంచి మాడిన మసాలా డోస్(దోస) ఇచ్చారు :).

అయినా ఎల్లకాలం మీరు శోధించండి, మీరు రాయండి, మీరు చెప్పండి మేము మాత్రం ఈకలు పీకుతాం అంటుంటే ఈ "పీకే" యువత శాతం ఎమైపొద్దో రామయ్యా??

ఏమవ్వదు హనుమయ్యా, నీ పిచ్చిగానీ ఇలాంటి వాళ్ళూ జనానికి ఇంత అని ఉండాలి, మిగిలిన జనం మన సుగుణాలని మరచిపొకుండా ఉండాలంటే. వీళ్ళ సంగతి వాళ్ళు చూసుకుంటారులే.


:: రామ రామ ::

శ్రీను .కుడుపూడి చెప్పారు...

అయ్యో రాజేష్ గారు !నేను వేరే ఉద్దేశ్యం తో " 'జ్ఞాని'ని కాదు "అని చెప్పలేదు .నిజం గానే నాకు అంత జ్ఞానం లేదు..ఆ ఉద్దేశ్యం తో నే అన్నాను .అయినా మనల్ని రాయమని ఎంకరేజ్ చేసే జనాలు కూడా ఉండాలి కదండీ !

అజ్ఞాత చెప్పారు...

/హహ్హా మాంచి మాడిన మసాలా డోస్(దోస) ఇచ్చారు :). /
రాజేసా, పై బ్లాగర్ వ్యాఖ్యతో మొహమలా మీడిన పెసరట్టులా పెట్టేసుకోనవసరంలేదు, అపుడపుడిలా నాకూ అవుతూ ఉంటుంది. ఇక్కడ బ్లాగరు సరిగ్గా అర్థంచేసుకున్నారు, మీరే అలా గాల్లో తన్నేసి సంబరపడిపోయారుగాని సెల్ఫ్ గోల్ అయ్యింది. అర్థంచేసుకో, రాజేసు. :D :))

Unknown చెప్పారు...

hai ssrinu mee article chala chala bagundi..hindu culture antha a bottu lo vuntunnadi..ade mana pavithratha ki chihnam..very nice..amma nudhuta bottu ni surya bimbham tho polchadam tho polcharu..exactly correct endukante surya baghavan veluguni anantha koti jeevulaki istadu..amma mukham kaanthi manaki eppudu jeevithaniki velugu istu kaapadutadi..aa velugu amma mokhani k vunde bottu chihnam mana hindu culture..ee matham aina amma ardam eppudu okkate kada ame challlani choopu manaki velugu istadi..
thanks srinu m.s amma ni gurtu chesaru..alage nannamma gurinchi mee feelings choosunte very happy..nenu alage nannamma , tathayya gurinchi alochistanu..nannamma velugu batte kada tana pillalu, manavalu welfare icharu.. keep it up
inka nundi mee articles gap rakunda ravalani korukuntunna..

శ్రీను .కుడుపూడి చెప్పారు...

@SABITHA: THANK U SABITHA GARU... :)

అజ్ఞాత చెప్పారు...

స్త్రీకి సంపూర్ణత్వం ఇచ్చేది నుదిటిమీదుండే ఆ బొట్టే. దీనికి మతంతో సంబంధం ఉందనుకోను. ఉదాహరణకి షబానా ఆజ్మీ, మార్గరెట్ ఆల్వా లు అంత వయస్సొచ్చినా, వారి అందం అంతా ఆ బొట్టులోనే !!!

శిశిర చెప్పారు...

శ్రీను గారు,
చాలా బాగుందండి మీ వ్యాసం. మీరు చెప్పినట్టు 'బొట్టు' రూపురేఖలు మారాయని ఒప్పుకుని తీరాలి.కానీ 'బొట్టు' చెరిగిపోతుందా అంటే అది ఎప్పటికీ జరగదనే నా ఉద్దేశ్యం. కాలంతో పాటొచ్చిన అన్ని మార్పుల్లోనూ ఈ మార్పు కూడా ఒకటి. ఆ మార్పు కూడా రూపు మారడమో, బొట్టు సైజు తగ్గడమోలాంటివి. చెరిగిపోవడం అయితేకాదు. :)
>>>ఈ కాలం అమ్మాయిలకైతే ...బొట్టు ఒక 'ఎబ్బెట్టు'!
ఇది కొందరి విషయంలో ఒప్పుకుని తీరాలి. :) కానీ ఇప్పటి ఉరుకుల పరుగుల జీవితంలో మన పూర్వీకులలాగా అన్నీ అలంకరించుకోగలుగుతున్నామా? మన వస్త్రధారణే చూడండి. మన తరానికీ, మన తాతల తరానికీ ఎంత మార్పు. ఇదీ అలాగే. మీ నాయనమ్మగారిలాగే మా అమ్మమ్మ, నాయనమ్మ కూడా చక్కగా మెరిసే పెద్ద కుంకుమ బొట్టుతో కళకళలాడేవారు. ఇప్పుడు నేనలా ప్రయత్నించాననుకోండి, రోజుకి పదిగంటలు ఇంటికి బయట పనివత్తిడితో ఉండే నేను కుంకుమతో దిద్దుకున్న నా బొట్టు సరిగా ఉందోలేదో చూసుకోగలనా? అందుకే ఆల్టర్నేటివ్ కృత్రిమ బొట్టు, అదే, స్టిక్కర్స్‌లాంటివి. :) సాంప్రదాయమైన ధోవతులు, ఏడు గజాల చీరలు పాంట్లు-షర్ట్లు, సల్వార్‌కమీజ్‌లయినట్టు బొట్టు కూడా రూపాంతరం చెందిందన్నమాట. :)
ఈ వ్యాసంలో బొట్టు గురించిన ప్రతి వ్యక్తీకరణ చాలా అధ్భుతంగా ఉంది. అభినందనలు.

శ్రీను .కుడుపూడి చెప్పారు...

దయచేసి ..ఎదుటి వారు మనో వేదన చెందే వాఖ్యలు చేయవద్దు .

శ్రీను .కుడుపూడి చెప్పారు...

@harephala:నా టపా కి స్పందించినందుకు ధన్యవాదాలండీ .

శ్రీను .కుడుపూడి చెప్పారు...

@శిశిర గారు !ధన్యవాదాలండీ .
టపా బాగుంది అంటూనే ..చిన్నగా చురకలు అంటించారు .
హ ..హ :)
నిజానికి నా ఆలోచన ఏమిటి అంటే ...
బొట్టు పరిమాణం ..రంగు గురుంచి కాదండీ నా బాధ !
కాలాన్ని బట్టి అన్నీ పద్దతులు రూపాంతరం చెందుతాయి ..కానీ ,ఆ సాంప్రదాయం వెనుకున్న అసలు 'సత్యాన్ని' మరవకూడదు కదా !కానీ నేటి యువత లో చాలా మంది మన సంప్రదాయాల్ని పాటించడం లో దాని వెనుకున్న 'సత్యాన్ని' గుర్తించడం లేదని నా బాధ !సాంప్రదాయక పద్దతులన్నీ ..కేవలం మన సరదాకోసమో ..అలంకారం కోసమే కాకూడదని నా ఆలోచన !
ఈ టపా రాయడానికి అసలు కారణం ఏమిటంటే..మొన్న నేను ఆటోలో వస్తుంటే ,ఆ అటో లో బొట్టు లేని {పెట్టుకొని } కొంత మంది తెలుగు అమ్మాయిలని చూసాక .. ఏదో కొంచెం బాధ అనిపించి ..రాయాలనిపించింది .అంతే...!

lalithag చెప్పారు...

"ఈ కాలం అమ్మాయిలకైతే ...బొట్టు ఒక 'ఎబ్బెట్టు'!"
మగవారికి ఏ కాలంలోనో ఎబ్బెట్టైపోయింది కదా!
మా చిన్నప్పుడే ఇలా ఇంకేదో ప్రభావాలకి లోనయ్యి బొట్టు పెట్టుకోరేమో అని బడికి వచ్చి బొట్టు గొప్పతనం గురించి చెప్పే వారు. మరి మా అమ్మమ్మకి నాకు ఊహ తెలిసినప్పుడు బొట్టు ... మా తాతయ్య లేరు.
ఈ నాడు బొట్టు చక్కగా నిలచి ఉంది, కావాలి అనుకునే వారందరి ముఖాల మీదా, సమాజం నుంచి ఏ అభ్యంతరాలు లేకుండా.

శిశిర చెప్పారు...

శ్రీను గారు,
చురకలు కాదండి. అభిప్రాయాలు మాత్రమే. నిజంగా నిజం. నమ్మండి. :) మీ అభిప్రాయం టపాలోనే అర్ధమయిందండి. చాలా క్లియర్‌గా రాశారు. మళ్ళీ వివరణ అవసరంలేదు. :) మీరు రాసింది చక్కగా అనిపించి ఇలా ఎందుకు జరుగుతూంది అని ఆలోచిస్తే బహుశా ఇవి కూడా కారణాలు అనిపించి మీకు చెప్పాను.
>>>సాంప్రదాయక పద్దతులన్నీ ..కేవలం మన సరదాకోసమో ..అలంకారం కోసమే కాకూడదని నా ఆలోచన!
అవును. చాలా చక్కగా చెప్పారు.

శ్రీను .కుడుపూడి చెప్పారు...

@Lalithag:THANK U :)


@శిశిర గారు :అర్ధం చేసుకున్నారు ..సంతోషమండీ

రాజేష్ జి చెప్పారు...

@తువ్వాయి గారు..
నేను భుజం తడుముకున్నా.. అందుకే రాస్తున్నా :)

హ్మ్.. ఆ SNKR చెప్పినదాంట్లో వ్యంగం కనిపించింది.. అందుకే నేను కూడా అలా చెప్పా.. అంతకు మించి "మనోవేదన" అన్నదానికి దగ్గరగా ఏమీ చెప్పలేదు. మీకు తర్వాతి కమ్మెంట్లలో అది చెప్పా కూడా!
Since I like your passion, I been obliged to give solid response.

$రాజేసా, పై బ్లాగర్ వ్యాఖ్యతో మొహమలా మీడిన పెసరట్టులా..

:)).. అలా ఏమీ లేదు.. ఈ బ్లాగారాయన త్వరలో
మాడట్టుకి, పెసరట్టుకి మద్య తేడా త్వరలోనే తెలుస్తుంది.

మంచు చెప్పారు...

మీ బాదే నాదీ :(

శ్రీను .కుడుపూడి చెప్పారు...

@రాజేష్ .జి: :)
@మంచు :మన ఇద్దరి బాధ ఒక్కటేనండీ!
ధన్యదాలండీ ..:)

శ్రీవాసుకి చెప్పారు...

మీ ఆర్టికల్ బాగుందండీ. ఆడవారి మాటేమోగాని నాకు చిన్నప్పటి నుంచి ఈరోజు వరకు బొట్టు పెట్టుకొనే అలవాటుంది. ప్రతీ సాంప్రదాయం వెనుక చక్కని విజ్ఞానం ఉంది.

శ్రీను .కుడుపూడి చెప్పారు...

@శ్రీ వాసుకి : అవునండీ ..ప్రతీ సాంప్రదాయం వెనుక విజ్ఞానం దాగి ఉంది .నుదుట అంటే రెండు కనుబొమ్మల మద్యన తిలక ధారణ చేస్తే ..జ్ఞాన నేత్రం వికసిస్తుందని పెద్దవాళ్ళు చెబుతారు .పెద్దల మాట 'చద్ది మూట' కదా !
మీరు మంచి పని చేస్తున్నారు .ధన్యవాదాలు .

భోగిమంట- కథ (సాక్షి ఫన్ డే )

సంక్రాంతికి సొంతూరు అమలాపురం బయలుదేరాము హైదరాబాద్ నుండి. కూకట్ పల్లి బస్టాప్ లో నిలబడ్డాం బస్సుకోసం.పండగ సందడిని పొట్లం కట్టుకుని నింగికి దూ...