27, నవంబర్ 2010, శనివారం

సోనియమ్మ 'ఆట '!

మా చిన్నపుడు మేము ఎంతో ఇష్టంగా గా ఆడే ఆట 'దాగుడు మూతలు' .

దాగుడు మూతలు అంటే..మామూలు గా కళ్ళకి గంతలు కట్టుకుని ఆడే ఆట కాదు .

మేము ఆడే ఆట విధానంబెట్టిదనగా ..,మేము 'ముద్దాయిగా 'నిలబెట్టిన ఒకతను ఓ చోట నిలబడి గట్టిగా కళ్ళుమూసుకుని...ఒకటినుండి పది వరకూ అంకెలు లెక్కపెట్టాలన్న మాట ! ఈ లోపు మిగిలిన పిల్లలమంతా ..ఆ మనిషికి కనిపించకుండా రహస్య ప్రదేశాల్లో దాక్కోవాలి .ఆలా దాక్కున్న వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో కనిపెట్టాలి (అలా జట్టులో చివరి మనిషి వరకూ దొరకాలి ) .

ఒక వేళ ఈ ఆట మద్యలో జట్టు లో ఎవరైనా ఆ 'వెదికే మనిషి' చూడకుండా వెనకనుండి వచ్చి "ఎస్" అని గట్టిగా అరుస్తూ ఆ మనిషిని ని ముట్టుకుంటే మళ్లీ ఆ మొదటి వ్యక్తే మళ్లీ మొదటినుండి ఆట ఆడాలి . అంటే ..చివరికంటా ఎవరికీ చిక్కకుండా అందరిని అవుట్ చెయ్యాలన్న మాట ! అలా చివరికంటా కనిపెట్టగలిగితే ...ఆ ఆటలో మొట్ట మొదట దొరికిన మనిషి 'ముద్దాయి' . అలా దొరికిన ముద్దాయి చేత ఇరవై గుంజీలు తీయించి ,మళ్లీ కొత్త ఆటని మొదలు పెట్టేవాళ్ళం .

ఇలా సాగేది మా ఆట!కొంచెం కష్టమే !ఎక్కువ సార్లు మనం ముద్దాయిగా దొరకుండా ఉండాలంటే ..మనకి ఒక అనుకూల వర్గం ఒకటి ఉండాలి .ఆ వెదికే వాడు మనవాడు అయితే .. పొరపాటున మనం ముందు కనిపించినా 'తూచ్ 'అన్నమాట ! పేరు కి అటే గానీ, ఆ ఆట ఎప్పుడూ కక్ష సాధింపు దిశ గానే జరిగేది . ఏక పక్షం గానే సాగేది . దీనంతటికి మూల 'సూత్రధారి ' మా తో కలిసి ఉంటూ ,మా తోనే గొడవలు పడే 'దుర్గ '.వయసులో మా కంటే కొంచెం చిన్నదే అయినా ,ఆలోచనల్లో మాత్రం ఆపిల్ల దేశముదురు !వాళ్ళ ఇంటి లో నుండి తెచ్చిన నువ్వుపప్పు జీడి లని ,మామిడి తాండ్ర లాంటి చిరు తిళ్ళు చూపించి ..మా జట్టులోని సగం మంది ని తనవైపుకే లాక్కోనేసేది .అందువలన తప్పనిసరి పరిస్థితుల్లో ఆమె 'పెత్తందారీ తనాన్ని' భరించాల్సివచ్చేది.

మొదట ఆట తనే మొదలు పెట్టేది ,ఆనక తనకి గిట్టని పిల్లల్ని తనే ఒక ఆట ఆడించేది . ప్రతీ ఆట లోనూ తనకి ప్రతికూలం గా ఉండే ఆటగాళ్ళని 'ముద్దాయి' లు గా చేసి గుంజీలు తీయించి ,మూడు చెరువుల నీళ్ళు తాగించేది .ఆ రకం గా వాళ్ళ మీద కక్ష తీర్చుకునేది .ఈ ఆటలో ..చిరుతిళ్ళు కి అలవాటు పడ్డవాళ్ళని ,కాస్తో కూస్తో అమాయకుల్ని తనకి అనుకూలం గా వాడు కుంటూ తన మాట లెక్కచేయని వాళ్ళ ఆట కట్టించేది.తనకి నచ్చినట్టు రూల్సు మార్చి దబాయించి మరీ తన ఆధిపత్యాన్ని నిలుపుకునేది ..అందరూ తను చెప్పినట్టే వినాలనే పంతం దుర్గది! .ఆ ఆధిపత్య ధోరణి ఆమె వయసుతో పాటే పెరిగి పెద్దదయ్యింది . తను పెద్దయ్యాక ఓ నాయకురలవుతుందేమో అనుకునేవాన్ని నేను !కానీ పెళ్లై అత్తారింటికి వెళ్లి తల్లైంది .

చాల రోజుల తరువాత నాకు దుర్గ గుర్తుకొచ్చింది -అది కూడా అఖిల భారత కాంగ్రేస్ కమిటీ అధ్యక్షురాలు సోనియమ్మ దయవల్లే!గత కొద్ది రోజులుగా దేశం లో జరుగుతున్న రాజకీయ పరిణామాల్ని చూస్తే ..మా దుర్గ కి ఆ అమ్మి కి ఏవో దగ్గరి పోలికలు ఉన్నాయనిపించింది నాకు .

దేశ రాజకీయాలలో ఎక్కడైనా ,ఎప్పుడైనా వాళ్ళ పార్టీ కి గానీ,వాళ్ళ కుటుంబ వారసత్వానికి గానీ ప్రతికూల పరిస్థితులు ఏర్పడినపుడు ఆమె అవలంబిస్తున్న తీరు ఆమెలోని 'ఆధిపత్య ధోరణికి 'అద్దం పడుతుంది.

"ఈ ఆధిపత్య ధోరణి అనేది ఇవాల్టి విషయం కాదని" ..కొద్దో గొప్పో రాజకీయ పరిజ్ఞానం ఉన్న మా పెద నాన్న గారు చెప్పినపుడు నాకు కొంచెం పరిస్థితి అర్ధమైంది . "ఈ గాంధీ కుటుంబీకులకి 'దేశాధికారం' తమ చేతులు దాటిపోవడం ఇష్టం ఉండదట !తమ అధికారాన్ని ,ఆధిపత్యాన్ని నిలుపుకోవడం కోసం ఏమి చెయ్యడానికైనా వెనకాడరట . ఆమె 'అత్తమ్మ' ఇందిరమ్మ హయాం లో ఈ 'హవా 'బాగా నడిచిందట !ఆమె అమలుపరిచిన "ఎమర్జన్సీ " ఆమెకి ఓ మాయని మచ్చ గా మిగిలిపోయింది !"

ఇందిరమ్మ గురుంచి మా పెదనాన్న గారు చెప్పిన మాటలేమో గానీ..,సోనియమ్మ విషయం లో మాత్రం ఈ 'హవా' నూటికి నూరు పాళ్ళు నిజమనిపిస్తుంది నాకు .మొన్న మన రాష్ట్రం లో జరిగిన' రాజకీయనాటకాన్ని' ఎంతో రసవత్తకరంగా రక్తి కట్టించినపటికి అసలు నిజం అతి సామాన్య మానవుడికి కూడా అర్ధమైపోయింది .సోనియా ఏక పక్ష నిర్ణయం వల్లే రోశయ్యగారు 'పదవీ విరమణ' చెయ్యడం ,కొత్త ముఖ్యమంత్రి గా కిరణ్ కుమార్ గారు భాధ్యతలు స్వీకరించడం జరిగిందన్నది ఇట్టే తెలిసిపోతుంది . ఈ నిర్ణయం తీసుకోవడం వెనుకు ఉన్న వ్యక్తిగత కారణాలు ఏమైనప్పటికీ ..ఈ డిల్లీ పెద్దలకి తెలుగు ప్రజానీకం పట్ల ,వారి మనోభావాల పట్ల కొంచెమైనా గౌరవం లేదన్న విషయం మాత్రం తేటతెల్లమవుతుంది .ప్రజలు ఎంతో నమ్మకం తో ఎన్నుకున్న నాయకుల ప్రమేయం కొంచెమైన లేకుండా (మాట్లాడే స్వేచ్చ ఇవ్వకుండా ..అనడం సబబు ) సోనియగారు ఏకపక్ష నిర్ణయం తీసుకోవడం తెలుగు ప్రజల్ని అవమాన పరచడమే . ఇలాంటి అవమానాల్ని చవిచూడటం వల్లే తారకరామారావు గారు "తెలుగు వాళ్ళ ఆత్మగౌరవం " అన్న నినాదం తో ఓ పార్టీని స్థాపించి ,విదేశాలలో తెలుగు మహా సభలు పెట్టి తెలుగు జాతి 'ఆత్మ గౌరవాన్ని' అంతర్జాతీయం గా వెలుగెత్తి చాటారు .బిడ్డ ఆకలి ..తల్లి కి తెలుస్తుంది!ఓ తెలుగు వాడి ఆత్మఘోష ఆత్మాభిమానం ఉన్న తెలుగు వాడికే తెలుస్తుంది . అందుకే మన తెలుగు వాళ్ళకి చుర కత్తి లాంటి తెలుగోడే నాయకత్వం వహించాలి -వెన్నెముక లేని కీలుబొమ్మ లు కాదు !

రాష్ట్రాల్లో 'అధికారమే' ఆ పార్టీ ప్రధాన అజెండా గా నడుచుకునే ఈ డిల్లీ నాయకత్వం ,ప్రజల మనోభావాల గురుంచి ..వాళ్ళ కష్ట ,నష్టాల గురుంచి ఆలోచిస్తుంది అనుకోవడం అవివేకం !వాళ్ళకి కావలసిందల్లా ..వాళ్ళు చెప్పినట్టు వినే కీలుబోమ్మల్లాంటి 'స్థానిక నాయకులు 'మాత్రమే !

ఇక మన రాష్ట్ర విషయానికి వస్తే .. ఇప్పుడున్న నాయకుల్లో కాస్తో కూస్తో ఆత్మాభిమానం ఉన్న రోశయ్య గారు ఆ 'కీలుబొమ్మ' పనిని సక్రమంగా నిర్వర్తించలేకే ..రాజీనామా చేసారా ?!లేక ..అధిష్టానమే తమ ప్రతికూల వర్గీయులకి 'చెక్' పెట్టడానికి ..అదే సామాజిక (ప్రత్యర్ధి సామాజిక వర్గం )వర్గానికి ,ప్రాంతానికి చెందిన కిరణ్ కుమార్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి ని చేసారా అనేది దైవ రహస్యం !ఈయన గారైనా ..తారక రామారావు గారి లా ,రాజశేఖరుడు లా తెలుగు జాతి ఆత్మ గౌరవాన్ని జగతికి వెలుగెత్తి చాటేలా పరిపాలిస్తాడో.. లేకుంటే, 'అమ్మ భజన 'చేస్తూ కీలుబొమ్మాలానే మిగిలిపోతారా అనేది ప్రస్తుత ప్రశ్న?! ఏది ఏమైనా ..ఈ 'కుర్చీలాట' చిన్న పిల్లల 'బొమ్మలాట 'లా అయిపోవడం మన ఆంధ్రరాష్ట్ర దురదృష్టం !సంవత్సరానికి ఒకరు చొప్పున కొత్తగా కుర్చీ ఎక్కిన సి .ఏం లు ,ఆ కుర్చీలో కుదురుకోవడానికే కొన్ని రోజులు గడిచిపోతాయి ..ఇంక రాష్ట్ర అభివృద్ధి గురుంచి ,సంక్షేమం గురుంచి ఆలోచించే సమయం ఎక్కడిది ?!

ఎంతైనా మా 'దుర్గ' నే నయం !తను మా ఆటలో కొన్ని రూల్సుని మార్చేది గానీ ..ఈ సోనియమ్మ లా మొత్తం 'ఆట' నే మార్చేది కాదు !!

9 కామెంట్‌లు:

astrojoyd చెప్పారు...

ఎంతైనా మా 'దుర్గ' నే నయం !తను మా ఆటలో కొన్ని రూల్సుని మార్చేది గానీ ..ఈ సోనియమ్మ లా మొత్తం 'ఆట' నే మార్చేది కాదు !!
---nice satirical punch

శ్రీను .కుడుపూడి చెప్పారు...

@astrojoyd:Thank u sir.welcome.

అజ్ఞాత చెప్పారు...

బాగా చెప్పారు. కానీ రాజశేఖర రెడ్డిని కూడా రామారావు గారిలా తెలుగు జాతి ఆత్మ గౌరవాన్ని నిలబెట్టినట్లుగా పేర్కొనడం బాలేదేమో? నాకు తెలిసి ఆయనంత సోనియమ్మ భజన మరే కాంగ్రేసి ముఖ్యమంత్రీ చెయ్యలేదు. కాకపోఅతే జనాలకోసం ఏదో చేస్తున్నట్లు బిల్డప్ ఇవ్వడం ద్వారా మహా నాయకుడనే ఇమేజ్ కొట్టేసాడు. ద్దాదాపు అన్ని పధకాల్లో ఆశ్రిత పక్షపాతం, అవినీతి ఎంత విచ్ఛలవిడిగా జరిగిందీ, నేటి ఈ రాష్ట్ర ఖజానా దుస్థితికీ ఆయనే కారణం అనేది కాదనలేని వాస్థవం. నిజానికి ఆయన ఇంకా బ్రతికే ఉన్నట్లయితే అందరికీ నిజాలు తెలిసొచ్చేవి. పాపం చచ్చి బ్రతికిపోయాడు:)

శిశిర చెప్పారు...

చాలా బాగా రాశారు. మీ అనాలసిస్ బాగుంది. మీరు ఈ ఆటలని పోల్చిన విధానం కూడా.
>>>>ఈయన గారైనా తెలుగు జాతి ఆత్మ గౌరవాన్ని జగతికి ఎలుగెత్తి చాటేలా పరిపాలిస్తాడో..

తెలుగు జాతి ఆత్మ గౌరవాన్ని జగతికి ఎలుగెత్తి చాటేలా పరిపాలించడం మాట అలా ఉంచి అసలు ముందు ఈయనగారు తెలుగులో మాట్లాడితే చూడాలని బహు కోరికగా ఉంది నాకు.

శ్రీను .కుడుపూడి చెప్పారు...

@Rs reddy garu:హ ..హ !అంతేనంటారా ...ఏమోనండీ అచ్చతెలుగు ఆహార్యం లో ఆయన నా మనసు దోచేశారు :). ఆయన అమ్మ భజన చేసినా ..దానివెనుక ఒక 'పరమార్ధం 'దాగి ఉండేదనుకుంటా !అందుకే ఆ అమ్మ కి ఆ భజన నచ్చలేదు .ఈ రోజుల్లో సంపాదించుకొని నాయకుడు ఎవరున్నారండీ?!.ధన్యవాదాలు .

@శిశిర గారు :హ హ ..చూద్దాం ఈయనగారు ఎలా పాలిస్తారో..!?ధన్యవాదాలండీ .

అజ్ఞాత చెప్పారు...

@"ఈ సోనియమ్మ లా మొత్తం 'ఆట' నే మార్చేది కాదు !!"
తూచ్. ఇప్పుడు జగన్ మొదలుపెట్టాడు కొత్త ఆట. ఫలితం ఎలా ఉంటుందో గానీ ఆరంభమే అదుర్స్

శ్రీను .కుడుపూడి చెప్పారు...

@Rsreddy garu:అవును జగన్ ఆట మొదలైంది .ఓ తెలుగోడిగా నా మద్దతు మాత్రం ఆయనకే ..:)

అజ్ఞాత చెప్పారు...

ఇప్పుడు జగన్ రాజీనామా చేస్తేకూడా అదే కధ పునరావృతం. సగటు మానవతావాది బాధపడాల్సిన, ఆ మాటకొస్తే సిగ్గుపడాల్సిన రోజు మళ్ళీ వచ్చింది. అదే జనం చావుల్ని నేతలపై అభిమానం ఖాతాల్లో వెయ్యడం.
జరగకూడనిది జరిగినంతమాత్రాన మరణమే శరణమా? ఈ నేతలు తామనుకున్నవి జరగకపోతే వారు మరణిస్తున్నారా? లేదే? పోరాటాలు చేస్తున్నారు, లేదా తిరుగుబాట్లు చేస్తున్నారు? కానీ వీరి అభిమానులుగా చెప్పబడుతున్నవాళ్ళు మాత్రం వీళ్ళకోసం మరణించాలా? నిజంగా మరణిస్తున్నారా? సహజ మరణాల్నీ, యాదృచ్చిక ఆత్మహత్యల్నీ నేతల ఖాతాల్లో వేస్తున్నామా? ఇది ఎటు దారితీస్తుంది?
అమాయక ప్రజల చావులతో ఆటలా? జగన్ రాజీనామాను తట్టుకోలేక ఉరివేసుకుని ఆత్మహత్య, గుండెపోటుతో మృతి? కొంచెం ఆలోచిస్తే తెలుస్తుంది ఇది ఎంత అత్యంత హేయమైన సాంప్రదాయమో. ఒక తల్లికి బిడ్డకీ ఉండేంతకంటే ఘనమైనదా ఈ నాయకులపై జనాలకుండే ప్రేమ? బిడ్డ మరణిస్తే ఆ తల్లికి గలిగే గుండెకోత వూహకందనిది. కానీ కాలం ఆ గాయాన్ని పూర్తిగా మాంపలేకపోయినా తట్టుకునే శక్తిని ప్రసాదిస్తుంది. అంతేగానీ బిడ్డతోపాటే తల్లినీ చిదిమెయ్యదు. అలాంటిది ఎవడో కౌన్‌కిస్కా గాడికోసం ఎవరో చనిపోవడం అనేది నిజంగా జరిగేదేనా? ఒకవేళ ఒకటీ రెండూ అలాంటివి జరిగే అవకాశం ఉందనుకున్నా ఇలా వంద, రెండొందలు.....అంటూ లెక్కబెట్టుకుంటూపోయేన్ని జరుగుతాయా? ఎంతమంది చస్తారో చూద్దాన్నంత రాక్షసానందంతో చూసే గుంటనక్కల ఆలోచన ఎలా అర్ధంచేసుకోవాలి? పైగా ఈ లఖ్ఖలుగత్టే పనిలో ఫోర్త్ ఎస్టేట్‌గా జనాన్ని తెగ ఉద్ధరిస్తున్నట్లు చెప్పుకునే ఈ మీడియానే నిమఘ్నమవడం ఎంత సిగ్గు చేటు?
వాస్థవానికి ఇంత పెద్ద రాష్ట్రంలో ప్రతిరోజూ ఎంతోమంది వివిధ కారణాల వల్ల ఆత్మహత్యలు చేసుకుంటూనే ఉంటారు, గుండెపోతుతో మరణిస్తూనే ఉంటారు. వాళ్ళలో అన్ని పార్టీలతో, నాయకులతో ఏదో ఒక అనుబంధం ఉన్నవాళ్ళుంటారు. అంతమత్రాన వాళ్ళ చావులన్నీ ఈ నాయకుల లెఖ్ఖల్లోకి వేస్తూపోతే అది ఎంత విపరీతాలకు దారితీస్తుందో ఆమాత్రం ఊహించలేరా ఈ ప్రబుద్ధులు? ఇలాంటివి మాటిమాటికీ ప్రసారం చెయ్యడంద్వారా కొంచెం సున్నిత హృదయులుగా ఉండేవళ్ళనూ, జరిగినదారుణం గురించే (నాయకుల చావు, రాజీనామా లాంటివి) పదే పదే తలుచుకుని బాధపడేవాళ్ళలో కొందరినైనా ఆత్మహత్యకు ప్రేరేపించినట్లుకాదా?
గతంలో నా మీటింగ్ కు ఇన్ని లక్షల మంది వచ్చారు, అంటే లేదు లేదు నీ మీటింగు కన్నా నా మీటింగ్ కు ఇన్నేసి లక్షల మంది ఎక్కువ వచ్చారు అని గొప్పలు చెప్పుకోవడం లాగా ఇప్పుడు నాకోసం ఇంతమంది చచ్చారంటే, లేదు లేదు నాకోసం ఇంత ఎక్కువ మంది చచ్చారు అని చెప్పుకొనే పరిస్థితులు దాపురించాయి. సచ్చినోళ్ళకోసం చావడం సంగతటుంచి బతికినోళ్ళలో కూడా మా నాయకునికి అవమానం జరిగిందనో, అరెస్టు చేసారనో ఆత్మహత్యలూ (యత్నాలూ) జరుగుతున్నాయి/జరిగినట్లుగా చిత్రీకరించబడుతున్నాయి. మొన్న మహబూబాబాద్ యాత్ర రద్దైనప్పుడు, బాబు బాబ్లీ డ్రామాలో అరెస్టయినప్పుడూ జరిగాయని చెప్పబడుతున్న ఆత్మహత్యలూ (యత్నాలూ) ఇందుకు ఉదాహరణ.ఇప్పుడు జగన్ రాజీనామా చేస్తేకూడా అదే కధ.
స్థూలంగా చెప్పాలంటే పెద్దలకోసం పేదోడు మరణించేలా మనం ప్రొత్సహిస్తున్నాం మరియు పేదోడి సహజ మరణాన్ని పెద్దోళ్ళ కోసం జరిగినట్లుగా చెప్పి పరిహసిస్తున్నాం. ఎంత అమానుషం? వాటికన్నిటికీ బాధ్యత ఎవరు తీసుకుంటారో?
అసలీ రాజకీయ క్రీడలలో ప్రజలెందుకు బలికావాలి? ప్రశ్న మరోలా అడగాలంటే తమ బ్రతుకు పోరాటంలో ఏటికెదురీగలేక మరణిస్తున్న అభాగ్యుల మరణాలను ఏదో ఒక నాయకుని ఖాతాలోకో, ఉధ్యమ ఖాతాలోకో జమ చేస్తున్న నాయకాధములదీ, వారికి తొత్తుల్లా పని చేస్తూ మరణాలను సైతం వివాదాస్పదం చేస్తూ, ఆత్మ హత్యలను మరింత ప్రోత్సహించేలా హైలైట్ చేస్తూ విపరీత పోకడలు పోతున్న ఫోర్త్ ఎస్టేట్ దీ ఎంత విపరీత ధోరణో కాదా? ఇది రాను రాను ఎటువంటి చెడుకు దారి తీస్తుందో కాదా?
ఒక నాయకుడు చనిపోయినప్పుడు వీరాభిమానంతో తట్టుకోలేక కొంతమంది, తెలంగాణా ఉద్యమంలో కొంతమంది చనిపోయింది వాస్తవమే అయినా ఈ మీడియా వారు ప్రతిదీ కవరు చేసి (ఒక్కోసారి కలరింగ్ ఇచ్చి - అంటే పదే పదే చూపడం etc.,)సాధించినది ఏమిటి? మరిన్ని ఆత్మ హత్యలు జరగడానికి కారణమయ్యారు తప్ప ఆగడానికి కాదనేది నిజం కాదా? పైగా ఈ ఆత్మ హత్యలకన్నింటికీ వ్యక్తిగతంగా అనో, పార్టీ పరంగా అనో, ప్రభుత్వ పరంగా(ఇంకా అనలేదు గానీ ముందుముందు అనవచ్చేమో?) అనో ఆర్ధిక సహాయం అంటూ చేస్తూ పోతే ఇది చివరకు ఎటు దారితీస్తుంది?
దీనిపై నేను వ్రాసిన టపా "మళ్ళీ మొదలైన అభిమానాత్మ'హత్యలు'" http://dare2questionnow.blogspot.com/2010/11/blog-post_30.html లో చూడగలరు

Unknown చెప్పారు...

hai srinu mee soniya amma ata chadivanu.. chinna vayasulo daagudu moothalu manammu antha childhood game..india rajeevudi dhayatho vachi mantho daagudu moothalu adutunnadi..okasari samaikandhra ani..okasari b/day cake piece ichinattu telangana ichanani ardam kaani personality india lo ade oka foreigner game..ntr telugudesam petti teluguvaalu anedi gurtinchetatlu chesadu..kaani rajasekharudu bratikivunna pratileni lenivaadi gundello tanu vunnadu oka annadaata,oka arogyasri, oka jalayagnam, scholarship..avaneethi annadi eppudu vunnadi adi ntr hayamlonu jarindi ippudu kothagaledu.appati proofs naa daggara chala vunnayi..hi-tech city evvari nirvakam janalaku teleeda..ysr mundu govt daagudumotthalu..kothaga avaneethi ippudu raledu..kaani ippudu kaneesanam lenivadu tindi tinnadu ysr padhakalatho..alanti manishini soniyamma sontha nirnayalatho ysr political journey debbatiyyataniki tana prameyamlekunda nirnalu teesukuntunna namminavaalaki anyayam cheyyani aa vyakthini addu rakunda chesi state gathi ela marchinadi. idi avida dagudumothalu..ippudu jagan political careertho daagudumoothalu..inthavaraku avida adindi jagantho ikamundu tanatho jagan babu adalani..asistunna..god bless u jagan..
srinu mee article naaku baga nachindi..thank u so much..nenu rase comment okarini kinchaparachatam kaadu..ysr edo avaneethi ante cheppanu..adi andarilo vundi..manam mundu change ayyi niswradamga alochana vundali..avaneethi vunte adi aadi nundi maname kada develop chesindi..any political leader fraud vuntaru antha genuine ga evvaru leru..ysr develop chesadu dwacra groups petti villages lo ladies ki individual life style..bc scholarships eemi govt sarigga ichindi ayana poyadu anthaka mundu aela ledu, ippudu assalu ledu..ayana hayamlo aa scholarships vachayi..free electricity, white ration card rs. 2/kg rice icharu anni ela vismaristunnaro teliyatam ledu..
very nice article srinu..god bless u..ee comment dwara evvarinanina hurt cheste i am sorry...dayachesi ysr soniyamma bhajana chesadu anavaddu..tana individual nirnayalu valana ayanani soniyamma maaku lekunda chesindi..i hate that foreign lady..

భోగిమంట- కథ (సాక్షి ఫన్ డే )

సంక్రాంతికి సొంతూరు అమలాపురం బయలుదేరాము హైదరాబాద్ నుండి. కూకట్ పల్లి బస్టాప్ లో నిలబడ్డాం బస్సుకోసం.పండగ సందడిని పొట్లం కట్టుకుని నింగికి దూ...