11, మార్చి 2010, గురువారం
ఓ తల్లి రోదన !
ఇక్కడ ఎవరో ఏడుస్తున్నారు ...
గుండె పగిలి ,గొంతు చిరిగేటట్టు !
ఇక్కడే కాదు
అక్కడ కూడా ..కాదు కాదు ఇంకెక్కడో ..
ఎక్కడెక్కడో అంతా అదే రోదన !
ఎవరని పరికించి చూస్తే ..
జుట్టు చెదిరి ,బొట్టు చెరిగి కళ్ళ లో "కృష్ణా..గోదావరి "ని నింపుకుని ..
అయోమయం లో ఓ "తేజోమయి "!!
ఎవరూ నీవు ?అని అడిగితే ...
"తెలుగు తల్లి "ని అంది .
కాదు కాదు ..'తెలంగాణా తల్లి' ని అంది.
నీవెవరో నీకే తెలియదా అంటే...
కడుపున పుట్టిన పిల్లలే క్షణానికో పేరు తో పిలుస్తుంటే ..
తానెవరో తనే మరిచిపోయాను అంది .
"నా ప్రేగు తెంచుకుని పుట్టిన పిల్లలే ..
నా గుండె ని చీల్చేస్తారేమో అని భయం వేస్తుందని " చెప్పి మళ్లీ గొల్లుమంది .
ఆ రోదన చూస్తుంటే ...అచ్చు "మా అమ్మ ఏడుపు" లానే ఉంది .
పాపం !ఆమె ఎవరో ?!
ఆమె 'గుండె కోత' ని ఎవరు అర్ధం చేసుకుంటారో ...!!
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
భోగిమంట- కథ (సాక్షి ఫన్ డే )
సంక్రాంతికి సొంతూరు అమలాపురం బయలుదేరాము హైదరాబాద్ నుండి. కూకట్ పల్లి బస్టాప్ లో నిలబడ్డాం బస్సుకోసం.పండగ సందడిని పొట్లం కట్టుకుని నింగికి దూ...
-
దేవుడి గుండె బండయ్యింది . ఆ తల్లి 'అండ' కొండెక్కింది ! ఈ తల్లి నిండుకుండైంది . తనే కొడుకయ్యింది ! తొణకకుం...
-
మా నాయనమ్మ పేరు సీతా మహాలక్ష్మి .నేను పుట్టకముందే చనిపోయింది ఆవిడ. నాకు ఆవిడ ని చూసే భాగ్యం లేదు కానీ ..ఆవిడ 'సౌభాగ్యం' గురుంచి మా ఊ...
-
'జగమంత కుటుంబం నాది..ఏకాకి జీవితం నాది ". ఈ పల్లవి నా మనసు లో మెదిలినప్పుడల్లా ..సీతా రామ శాస్త్రి గారు నా మనసులో భావన ని ఎలా కనిపె...
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి