10, మార్చి 2010, బుధవారం

ఎబౌట్ మి..@ స్నేహం కోసం ….



అక్షర సుమాల తో సాహితీ సౌరభాలు వెదజల్లే ..సాహితీ మూర్తులు అందరికీ నా"సుమాంజలి ".
సాహితి వనం లో ఇప్పుడిప్పుడే బుడి బుడి అడుగులు వేస్తున్న ఈ బుల్లి 'తువ్వాయి 'కి స్నేహ హస్తం అందిస్తారని ఆశ తో ..
నా గురుంచి కొంచెం..

కొంచెం కోపం..
కొంచెం జాలి ..
ఇంకొంచెం భయం ,బిడియం
మరి కొంచెం గర్వం .

మనసు నిండా ప్రేమ ..
భవిత మీద బోలెడంత ధీమా !

పుస్తకాలూ చదవడం అంటే ఇష్టం.
రాయడమంటే ఇష్టమైన ఇష్టం ! (ఇంత వరకు ఏమీ రాయలేదనుకొండీ ).

చందమామ .. వెన్నెలమ్మ
చిన్నపిల్లలు ..గడ్డి పువ్వులు
నల్లని మబ్బులు ..ఎగిరే పక్షులూ

మా కోనసీమ కొబ్బరాకులు ..
ఆత్రేపురం "పూత రేకులు "
పిల్ల కాలవ లో చేప పిల్లలు
గడ్డివాము లో కుక్కపిల్లలు

తొలకరి చినుకు ..
కోయిల పలుకు
మా గోదావరి పరుగు
మా ముగ్గుల అరుగు

పచ్చని చేలు ..పైరు గాలి
అమ్మ పిలుపు ..
మా లేగ దూడ అరుపు
మా గుడి లో మేలుకొలుపు..
నాకు చాలా ఇష్టం !

స్నేమంటే ఇష్టం .
స్నేహానికి ప్రాణం పెట్టె స్నేహితులంటే ఇంకా ఇష్టం .

ఇంకా చెప్పాలంటే ..
మనలో మన మాట .(ఎవరికీ చెప్పకండే )

అందమైన వాలు జడలు..
ఘల్లుమనే కాలి మువ్వలు
కవ్వించే కొంటె చూపులు ..
మురిపించే చిలిపి నవ్వులు
నా మనసున కురిసే .. వలపు జల్లులు !

ఇక చివరి మాట వినండి మరి ..
నా ఇష్టదైవం "శ్రీ హరి "
నేను చేసేది గుమాస్తా గిరి (ఆయన ఆపద మొక్కులవాడు , నేనేమో అప్పుల బాధల వాడ్ని . )
నా తలేమో "తిరుమల గిరి"(బోల్డు హెడ్ ).

నా తో స్నేహం చేస్తారా ..మరి ?!

2 కామెంట్‌లు:

శిశిర చెప్పారు...

చాలా బాగా రాశారు. కోనసీమవారా? మాదీ కోనసీమేనండి. మీ బ్లాగు మొత్తం చదువుతున్నాను. బాగుంది. అభినందనలు.

శ్రీను .కుడుపూడి చెప్పారు...

శిశిర గారు !మీకు నా ధన్యవాదాలు .లోక జ్ఞానం పెద్దగా లేని వాణ్ణి ,ఏదో నాకు తోచింది రాస్తున్నాను.మాది అమలాపురం దగ్గర చిన్న పల్లెటూరు .మీ బ్లాగ్ చదివాను .చాలా బాగుంది .

భోగిమంట- కథ (సాక్షి ఫన్ డే )

సంక్రాంతికి సొంతూరు అమలాపురం బయలుదేరాము హైదరాబాద్ నుండి. కూకట్ పల్లి బస్టాప్ లో నిలబడ్డాం బస్సుకోసం.పండగ సందడిని పొట్లం కట్టుకుని నింగికి దూ...