19, ఏప్రిల్ 2010, సోమవారం

విషపు చుక్కలు



ఈ రోజు తెల్లగా తెల్లారింది ప్రతి రోజు లానే ...

నిన్న మొన్నటి వరకు ఆప్యాయం గా నీ బుగ్గల్ని నిమిరిన ఆ చేతులే ..
ఈ రోజు నీ మెడ పై కర్కశం గా బిగుసుకుంటున్నాయి .

ప్రేమ పేరు తో నీవు పంచి ఇచ్చిన విషపు చుక్కలే ..
ఈ రోజు వాడి లో 'ఉన్మాధాగ్ని' యై .. విలయ తాండవం చేస్తుంది .

నీవు వాడి గుండె కు చేసిన గాయం నొప్పి లో ..నీ గొంతు నొప్పి వాడి కంటికి అనడం లేదేమో ...
"మృగ "మై పోయాడు .

ఇంతకీ తప్పెవరిది ?!
ఆశ పెట్టిన నీదా?అత్యాశ పడిన వాడిదా?!

ఏమైతేనేం ...కదిలే కాలం మీ కోసం ఆగదు గా ...
చిమ్మ చీకటి మీ ఇద్దరి రుధిరం తో మరింత చిక్కబడి మరో 'ప్రేమ జంట 'ని బలి తీసుకోడానికి మళ్లీ రేపటి కి తెల్లగా తెల్లారుతుంది .

3 కామెంట్‌లు:

మనసు పలికే చెప్పారు...

తువ్వాయి గారు, చదువుతున్నంత సేపూ మనసంతా ఏదోలాగా అయిపోయింది. చాలా చేదు నిజం మన కళ్ల ముందే నాట్యమాడుతున్నట్లుగా ఉంది.. ఏమో.. చెప్పలేక పోతున్నాను నా భావాలు.

Padmarpita చెప్పారు...

so...sad:(:(

శ్రీను .కుడుపూడి చెప్పారు...

@మనసు పలికే :నిజమేనండి .'ఉన్మాది చేతిలో ప్రియురాలు హత్య 'లాంటి వార్తల్ని చదివినప్పుడల్లా నా మనసు కి చాలా బాధ గా అనిపిస్తుంది .

@పద్మార్పిత గారు :బాధ పడటం తప్ప మనం ఏమి చెయ్యలేం ..అంటారా?!

భోగిమంట- కథ (సాక్షి ఫన్ డే )

సంక్రాంతికి సొంతూరు అమలాపురం బయలుదేరాము హైదరాబాద్ నుండి. కూకట్ పల్లి బస్టాప్ లో నిలబడ్డాం బస్సుకోసం.పండగ సందడిని పొట్లం కట్టుకుని నింగికి దూ...