25, అక్టోబర్ 2011, మంగళవారం
20, జూన్ 2011, సోమవారం
నిజాలు
మనసు ని వెన్నెల లా చేసి చూడు...జీవితం మనం అనుకోనేంత 'చిక్కుముడి' కాదు!
మన నెత్తి మీద బండ రాళ్ళు ఏమి లేవు..మన చుట్టూ మనకు మనమే గీసుకున్న లక్ష్మణ గీతలు తప్ప...!!
మన' రంగుల కలలే 'మనకు భారం కాకూడదు ,చితాకోక చిలుక ని చూడు ...రంగుల దుప్పటి కప్పుకొని ఎంత స్వేచ్చగా ...ఎగురుతుందో!!
మనం ఎవరికోసమో ఎదురు చూడటం మన అవివేకం !-
'గడ్డి పువ్వు'ని చూడు ..దేవుడి పూజకు పనికి రాకున్నాఉదయ కాలపు మంచు లో ఎలా మెరిసిపోతుందో !!
జీవితం లో దేనినీ ఆశించ వద్దు ....శాసించు !!
నీవు కోరుకున్న జీవితం ..నీ కాళ్ళ ముందు మోకరిల్లుతుంది ..!
మన నెత్తి మీద బండ రాళ్ళు ఏమి లేవు..మన చుట్టూ మనకు మనమే గీసుకున్న లక్ష్మణ గీతలు తప్ప...!!
మన' రంగుల కలలే 'మనకు భారం కాకూడదు ,చితాకోక చిలుక ని చూడు ...రంగుల దుప్పటి కప్పుకొని ఎంత స్వేచ్చగా ...ఎగురుతుందో!!
మనం ఎవరికోసమో ఎదురు చూడటం మన అవివేకం !-
'గడ్డి పువ్వు'ని చూడు ..దేవుడి పూజకు పనికి రాకున్నాఉదయ కాలపు మంచు లో ఎలా మెరిసిపోతుందో !!
జీవితం లో దేనినీ ఆశించ వద్దు ....శాసించు !!
నీవు కోరుకున్న జీవితం ..నీ కాళ్ళ ముందు మోకరిల్లుతుంది ..!
25, ఫిబ్రవరి 2011, శుక్రవారం
24, జనవరి 2011, సోమవారం
సంక్రాంతి
కళ్ళాపి చప్పుళ్ళు ..రంగు ముగ్గులు ,
బోగి మంటలు ..గొబ్బి పాటలు ,
వాలు జడలు ..వార చూపులు ,
ముద్ద బంతులు ..వరి కంకులు ,
హరి దాసులు ..డూ డూ బసవన్నలు ..
పల్లెలోని సంక్రాంతి సందళ్ళు !
పట్నం బ్రతుకులో ..మిస్సయి ఎన్నాళ్లైందో ..
ఈ అందాలూ ..అనుభూతులు !!
పప్పు చెక్కలు ..పాకం అరిసెలు ,
జంతికలు ..కజ్జికాయలు ..తీపి గారెలు ,
చిరుతిళ్ళు కావవి ...సంక్రాంతి పండక్కి ,
కొడుకు ఇంటికి రాలేదని ..పట్నం బస్సు కి
మా అమ్మ పొట్లం కట్టిచ్చిన "ముద్దులు -మురిపాలు ".
వాటిని చూస్తే ..
నా నోట్లో నీళ్ళురుతాయి!
ఆ వెంటనే ..కళ్ళల్లో నీళ్ళు తిరుగుతాయి !!
నోట్ :ఊరినుండి అమ్మ,అత్తయ్యలు పంపిన జంతికలు ..
అరిసెలు చూశాక ..నా మనసు లోనుండి కురిసిన 'ముత్యపు చినుకు 'లివి !
ఈ పోటో మాత్రం నాది కాదండోయ్ .
29, డిసెంబర్ 2010, బుధవారం
26, డిసెంబర్ 2010, ఆదివారం
25, డిసెంబర్ 2010, శనివారం
సిటీ లైఫ్
పక్కింట్లో పసి పిల్లోడి కేరింత ..
మా ఊరి పెరటి తోట లో కోయిల పాటలా ....!
వాడి బుగ్గలు పుణికి ముద్దు చేయగలనా ..?!
మనుషుల మనసుల్లో ...
గోడలు కట్టేసుకున్న ఈ కాంక్రీట్ జంగిల్లో..
మా పక్కింటోల్లు ,ఎప్పటికీ...
'అపరచితులే' ..ఎన్నేలయినా!
ఆకాశం లో ...వెన్నెల చందమామ !
ఆకాశ హర్మ్యాం లో ఉన్నా ..
పొందలేనేమో మా 'పల్లె' పంచిన అనుభూతిని ..!
కొబ్బరాకుల సందుల్లోంచి జారి ముద్దాడే వెన్నెల హాయిని !!
మనిషి గా ఎదిగిపోతున్నా ..
నా మనసే "మరుగుజ్జు "అవుతుంది , చిత్రం గా ... !
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)
భోగిమంట- కథ (సాక్షి ఫన్ డే )
సంక్రాంతికి సొంతూరు అమలాపురం బయలుదేరాము హైదరాబాద్ నుండి. కూకట్ పల్లి బస్టాప్ లో నిలబడ్డాం బస్సుకోసం.పండగ సందడిని పొట్లం కట్టుకుని నింగికి దూ...
-
మా నాయనమ్మ పేరు సీతా మహాలక్ష్మి .నేను పుట్టకముందే చనిపోయింది ఆవిడ. నాకు ఆవిడ ని చూసే భాగ్యం లేదు కానీ ..ఆవిడ 'సౌభాగ్యం' గురుంచి మా ఊ...
-
వినాయక చవితి ! "నాన్నోయ్ !నాలుగు యాప్లిస్ కాయలు (ఆపిల్స్ ),నాలుగు బత్తాకాయలు ,ఆరు మొక్క జొన్న పొత్తులు ,రెండు ఎలక్కాయలు(వెలగపండు ).......
-
"ఒరేయ్ ..ఆడేం పార్టీ?" "మన పార్టీనేరా..క్రిష్ణా పార్టీ .." వేసవి సెలవుల కి మా ఊరోచ్చిన మా చిన్నమ్మ కొడుకు శీను ని మా జట్...





