25, డిసెంబర్ 2010, శనివారం

సిటీ లైఫ్





 పక్కింట్లో పసి పిల్లోడి కేరింత ..
మా ఊరి పెరటి తోట లో కోయిల పాటలా ....!
వాడి బుగ్గలు పుణికి ముద్దు చేయగలనా ..?!
మనుషుల మనసుల్లో ...
గోడలు కట్టేసుకున్న ఈ కాంక్రీట్ జంగిల్లో..
మా పక్కింటోల్లు ,ఎప్పటికీ...
'అపరచితులే' ..ఎన్నేలయినా!


ఆకాశం లో ...వెన్నెల చందమామ !
ఆకాశ హర్మ్యాం లో ఉన్నా ..
పొందలేనేమో మా 'పల్లె' పంచిన అనుభూతిని ..!
కొబ్బరాకుల సందుల్లోంచి జారి ముద్దాడే వెన్నెల హాయిని !!
మనిషి గా ఎదిగిపోతున్నా ..
నా మనసే "మరుగుజ్జు "అవుతుంది , చిత్రం గా ... !

3 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

please watch & subscribe
http://bookofstaterecords.com/
for the greatness of telugu people.

శిశిర చెప్పారు...

కొబ్బరాకుల సందుల్లోంచి జారి ముద్దాడే వెన్నెల హాయిని
Beautiful Expression.

నేనైతే రోజూ చూస్తున్నానండి కొబ్బరాకు చాటున దోబూచులాడుతూ వెన్నెల కురిపిస్తున్న చందమామని.
ఒక పెద్ద ఉసిరి చెట్టు ఉందండి ఇక్కడ. ఆ చెట్టు ఆకుల మధ్య నుండి చంద్రుడు చాలా అందంగా కనిపిస్తున్నాడు. :)
మీ ఊరుని బాగా మిస్‌ అవుతున్నట్టున్నారు.
బాగా రాశారు.

శ్రీను .కుడుపూడి చెప్పారు...

@శిశిర గారు :అవునండీ ..ఈ పట్టణాలు అంటే నాకు అస్సలు ఇష్టం ఉండదు .
నేను మా ఊరిని నేను చాలా మిస్ అవుతున్నానండీ.ఊరిలో ఉన్నంత సచ్చమైన మనసులు ,ప్రశాంతమైన వాతావరణం ఇక్కడ దొరకడం లేదండీ !:).మీకు ధన్యవాదాలు .

భోగిమంట- కథ (సాక్షి ఫన్ డే )

సంక్రాంతికి సొంతూరు అమలాపురం బయలుదేరాము హైదరాబాద్ నుండి. కూకట్ పల్లి బస్టాప్ లో నిలబడ్డాం బస్సుకోసం.పండగ సందడిని పొట్లం కట్టుకుని నింగికి దూ...