11, డిసెంబర్ 2010, శనివారం

చిన్నప్పటి స్నేహితురాలు ..




నా చిన్నప్పుడు .....
ఆమె వెండి మువ్వల పట్టీల
చప్పుడు ..నాకు వేకువ ఝామున ..
మేలుకొలుపు'!
ఆమె నవ్వు -మా ఊరి గోదారి అలల పాట !



పట్టు పరికిణీ కట్టిన 'పాలనురుగు' తను!
మా శెట్టి కొట్టులోకొచ్చిన కొత్త రంగు రిబ్బన్సు
కి ,బొట్టు బిల్లలకి మా ఊరి ' మోడల్ 'తను .



మా పిల్ల బ్యాచ్ కి 'రైలింజన్'తను .
మా కొత్త ఆలోచనలకి ,
అవిడియాలకి 'సెర్చ్ ఇంజిన్ ' తను.



నాకు దొరికిన చిలక్కొట్టిన
జాంపండు కి 'వాటా దారు 'తను .
నాకు పరీక్షల్లో వచ్చిన పాస్ మార్కులకి..
"దిక్కు -దారి "తను .



నేను బడి కి వెళ్ళేటపుడు 'మిత్రురాలు' తనే!
బడి నుండి వొచ్చాక....
తను మా అమ్మ ఒడిలో వాలి ...
గారాలు పోతున్నపుడు నా 'శత్రువు' తనే!!
ఇప్పుడు ...


పోయినా సంక్రాంతి పండక్కి కి నేను
ఊరెల్లినపుడు..మా ఊరొచ్చిన 'పుట్టింటి ఆడపడుచు'తను !
ఈ 'పెద్ద పండక్కి' వరకట్న పిచాశానికి బలై...
పెద్దల్లో కలిసిపోయిన 'నిండు ముత్తైదువ' తను!!
నాకు మాత్రం ...
ఎప్పటికీ జ్ఞాపకాల పుటల్లో ..
అపురూపం గా దాచుకునే ' నెమలికన్ను'తను.

9 కామెంట్‌లు:

రాధిక(నాని ) చెప్పారు...

ఈ 'పెద్ద పండక్కి' వరకట్న పిచాశానికి బలై...
పెద్దల్లో కలిసిపోయిన 'నిండు ముత్తైదువ' తను!!

నాకు మాత్రం ...
ఎప్పటికీ జ్ఞాపకాల పుటల్లో ..
అపురూపం గా దాచుకునే ' నెమలికన్ను'తను.

చాలా బాగుందండి.
నిజంగా జరిగిందేనండి?ఆలా ఐతే మాత్రం చాలా విషాద ఘటన...

శ్రీను .కుడుపూడి చెప్పారు...

@రాధిక గారు :ఇది నా స్నేహితుడి ఆవేదనకి అక్షర రూపం అండీ !
దురాచారాలకి,ఉన్మాదుల దుశ్చర్యలకి..మంచి స్నేహితురాళ్ళు ని పోగొట్టుకుంటున్న నా స్నేహితుడులాంటి 'స్నేహితుల' మనోవేదన ఇది . మీ స్పందనికి ధన్యవాదాలు

Unknown చెప్పారు...

hai srinu chinnappati snehithuralu chala painfulga anipinchindi..real story na..chaduvutunte chala badhaga anipinchindi..ee varakatna pisachiki inko vadhuvu bhali ayyindi kada..papam mee friend tanu anthaga abhimaninche chinnanaati snehituralini kolpoyaru kada..chala badhaga vundi..

శిశిర చెప్పారు...

కొన్నిసార్లు కలిగే భావాలు వ్యక్తపరచడానికి మాటలకన్నా మౌనమే ఆధారమౌతుంది. చిన్నప్పుడు మా ఊళ్ళో జరిగిన రెండు వరకట్న మరణాలు గుర్తొచ్చి ఏమీ మాట్లాడలేక మీ బ్లాగునుండి మౌనంగా వెళ్ళిపోయి, మౌనంగా ఉండలేక మళ్ళీ వచ్చాను.

శ్రీను .కుడుపూడి చెప్పారు...

@సబిత:నిజమే ..అక్కా !చిన్నప్పటి స్నేహితుల్ని కోల్పోతే ..ఆ మిత్రులు అనుభవించే బాధ వర్ణనాతీతం .
ఇలాంటి అనుభవం నా జీవితం లో కూడా ఉంది .

@శిశిర గారు :@"కొన్నిసార్లు కలిగే భావాలు వ్యక్తపరచడానికి మాటలకన్నా మౌనమే ఆధారమౌతుంది."-
శిశిర గారు మీరు చెప్పింది నిజమేనండీ !నా మిత్రుడు తన ఆవేదనని నాతో చెప్పినపుడు ..బాధ తో భారమైన నా మనసులోనుండి వచ్చిన అక్షరాలే ఇవి...అయినా ఏదో వెలితి !ఒక్కోసారి మౌనానికి మించిన భావ వ్యక్తీకరణ ఇంకోటి ఉండదండీ!

గీతిక చెప్పారు...

చదవడం పూర్తవగానే ఒక్క క్షణం గుండె భారమైన మాట వాస్తవం.

కానీ ఆ సంఘటనని..
చదివిన ప్రతివారికీ అనుభవించిన భావన కలిగేట్లుగా వ్రాయడమంటే కష్టమే. చాలా బాగా వ్రాశారు.

మీ స్నేహితుని పరిస్థితి చాలా బాధాకరమైనదే...

ఊకదంపుడు చెప్పారు...

చాలా ఆర్ద్రం గా చెప్పారండీ

Unknown చెప్పారు...

శ్రీను గారూ,

మీ కవిత "కేక!!!!!!!!!!!!!!"

హృదయాలను తాకింది మీ కవిత.

ఉషాకిరణ్

శ్రీను .కుడుపూడి చెప్పారు...

@గీతిక గారు:

@ఊకదంపుడు గారు :

@ఉషా కిరణ్ గారు :

మీ స్పందనలే ..ఆ తల్లి కి అశ్రు నివాళి .ధన్యవాదాలు .

భోగిమంట- కథ (సాక్షి ఫన్ డే )

సంక్రాంతికి సొంతూరు అమలాపురం బయలుదేరాము హైదరాబాద్ నుండి. కూకట్ పల్లి బస్టాప్ లో నిలబడ్డాం బస్సుకోసం.పండగ సందడిని పొట్లం కట్టుకుని నింగికి దూ...