26, సెప్టెంబర్ 2010, ఆదివారం

కడుపు మంట


ఐదు నక్షత్రాల అంగడి లోనైనా ..
రోడ్డు పక్క ధాబా లోనైనా ..
గుభాళించదేం ..మా అమ్మ పెట్టే 'పోపు'తాలింపు?!

ఈ అ'భాగ్య ' నగరాల్లో .....
కోట్లు కుమ్మరించినా దొరకనిది అమ్మ ప్రేమే కాదు ..సుమీ!
కమ్మని అమ్మ చేతి వంట కూడా !!

(ఓ బ్యాచిలర్ 'కడుపుమంట' )

12 కామెంట్‌లు:

శేఖర్ పెద్దగోపు చెప్పారు...

చప్పట్లు...

శిశిర చెప్పారు...

బ్యాచిలర్‌గానే కాదు, ఓ ఇంటివారైనా కూడా కమ్మని అమ్మ చేతి వంట రుచి, అమ్మ చల్లని ప్రేమ వేరొకరు ఇవ్వలేరేమో. :) అమ్మకి అమ్మే సాటి.

అజ్ఞాత చెప్పారు...

I am siva krishna from amalapuram

nice see you at blog (urs) your blog alsi good..

Amalapuram lo ekkada

Truely చెప్పారు...

ఆవిడ వంట ఒక్క సారి అలవాటైంది అంటే మళ్ళి వదలరు అప్పటి దాక చెయ్యి కాల్చుకోవాలి తప్పదు

మనసు పలికే చెప్పారు...

పాపం కదా బ్యాచిలర్స్.. ఎన్ని కష్టాలో..:(

పరిమళం చెప్పారు...

ఈమధ్య టీవీలో ప్రత్యేకంగా బాచిలర్స్ వంటలు చూపిస్తున్నారు ట్రై చేయండి అమ్మ చేతి రుచి రాకపోయినా బ్రహ్మాండంగా చేస్తున్నారు :)

శ్రీను .కుడుపూడి చెప్పారు...

నిజమాండీ..నేను చూడనేలేదు .నేను కూడా ట్రై చేస్తానండి .మొదటి ముద్ద మాత్రం మా ఎలుకల బోను లో పెడతాను :).
మీకు ధన్యవాదాలు ...

Unknown చెప్పారు...

srinu garu meeru cheppinsicent% correct..amma cheti vantaki, amma premaki saati evvaru raaru.meere kaadu even ippatiki nenu amma cheti vant ruchi kosam aratapadatanu..amma manalini tana matrutvam ane mamakaramtho navamasalu mosi kani penchindi..annitlo kalthi vunna amma premaki ledu kada..ade thalli mamakarame ame biddaki vandi pette chethi ruchi..chala bagundi..all the best .keep it up..

కొత్త పాళీ చెప్పారు...

మీరే వొండుకుంటే సరి :)

శిశిర చెప్పారు...

శ్రీను గారు,
శేఖర్ గారిని "మురళి గారు" చేసేసినట్టున్నారు. చూడండి. :)

శ్రీను .కుడుపూడి చెప్పారు...

@శేఖర్ గారు :హ..హ ..సంతోషమండీ .

@శిశిర గారు :నిజమేనండీ ...ఈ లోకం లో మనకి ఆ దేవుడిచ్చిన మంచి బహుమతి 'అమ్మే' కదా .

@ శివ కృష్ణ గారు :సంతోషమండీ ..మాది అమలాపురం దగ్గర చిన్న ఊరు -నడిపూడి .ధన్యవాదాలు .

@Truely:నాకు ఆ భాగ్యం కూడా లేదండి ..నేను చేసుకోబోయే అమ్మాయికి కనీసం టీ పెట్టడం చేత కాదు .

@మనసు పలికే :కష్టాలే కాదండీ...కాసిన్ని సంతోషాలు కూడా ఉంటాయి :)..హి..హి ..అవి చెప్పుకోం కదా !ధన్యవాదాలండీ .

శ్రీను .కుడుపూడి చెప్పారు...

@కొత్తపాళీ గారు :వండుకునే టైము లేకేకదాండీ ..ఈ కడుపుమంట !:)
@శిశిర గారు :నిజమేనండీ ..నేను గమనించనే లేదు...ధన్యవాదాలు .

భోగిమంట- కథ (సాక్షి ఫన్ డే )

సంక్రాంతికి సొంతూరు అమలాపురం బయలుదేరాము హైదరాబాద్ నుండి. కూకట్ పల్లి బస్టాప్ లో నిలబడ్డాం బస్సుకోసం.పండగ సందడిని పొట్లం కట్టుకుని నింగికి దూ...