21, సెప్టెంబర్ 2010, మంగళవారం

దోబూచులాట



నా హృదయం గాయం చేసి ..
మళ్లీ వెన్నెల పూసి ..
చెలీ !ఎన్నాళ్ళిలా..?!

నా మది లో ఆశలు రేపి ..
కొత్తగా లోకం చూపి ..పొమ్మంటే ఎలా ?!

సఖి !
నీ తడి తడి పెదవుల 'తొలి జ్ఞాపకం ' ఎప్పటికీ తడి ఆరిపోదు ..
నీ గల గల నవ్వుల 'కమ్మని రాగం 'ఎన్నటి కీ నా మదిని విడిపోదు ..

ఏమిటో చిత్రం గా ..ఒక్కోసారి ..
చావైనా..బ్రతుకైనా నా తోనే అంటావు ..నా కలలో సైతం తోడుంటావు .
ఆ కమ్మని కలలో హరివిల్లు తెచ్చుకుని పొదరిల్లు కట్టుకుంటాను .
ఆ కలల పొదరింట్లో కి నిన్ను రమ్మంటే ...
మళ్లీ 'కెరియర్ 'అంటావు .. నా కమ్మని కలల్నివిసిరేసి దూరం పారిపోతావు.

ఆశల రెక్కల్ని నీ వీపు కి కట్టుకుని ఎక్కడికో ఎగిరిపోతూ ..
నన్ను కన్నీటి కడలి లోకి తోచేస్తావు.
"నా బ్రతుకింతేనని" .. నా గుండె గాయానికి కన్నీటి మందు పూస్తుంటే ...
మళ్లీ మరుమల్లె లా వచ్చి నీ 'మానస సరోవరం' లో ముంచెత్తుతావు -మరుజన్మలోనైనా నన్ను వీడిపోనంటావు !!

ఎందుకిలా ?!
ఓ సారి వరమిస్తావు .. మరుక్షణమే నిరసిస్తావు .
అసలు దీనిని ఏమంటావు ..ప్రేమంటావా ?!
లేక ,చివరికి -'సరదాకి 'అని చెప్పి పొమ్మంటావా ?!

(ఎక్కువ పీల్ అవ్వకండి ..ప్లీజ్ ! )

8 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

gunde kadilinchi.. ekkuva feel avvakandi ante elaa..

baavundi!

Unknown చెప్పారు...

hai srinu mee dobochulata kavitalo oka abbayi ammayi pi pranam kanna ekkuvaga penchukunna apurupamaina viluvakattaleni goppa prema daagi vundi..aa preminche manasunu aa ammayi ardam chesukovalani korukuntunna. very nice kavita..all the best....

శ్రీను .కుడుపూడి చెప్పారు...

సబిత గారు ధన్యవాదాలండి . ఈ కవిత లోని లోతు మీకు అర్ధం అయినందుకు సంతోషం .

శ్రీను .కుడుపూడి చెప్పారు...

Hanu garu! Thank u sir.

పరిమళం చెప్పారు...

"నా హృదయం గాయం చేసి ..
మళ్లీ వెన్నెల పూసి ..
చెలీ !ఎన్నాళ్ళిలా..?!"Beautiful!!
ఇలా రాసేసి ఫీలవ్వోద్దంటే ఎలా మానేస్తాం చెప్పండి ??

శ్రీను .కుడుపూడి చెప్పారు...

పరిమళ గారు !చాలా రోజులు తరువాత నా బ్లాగ్ లో మీ కామెంట్ చూసి చాలా సంతోషం గా అనిపించింది అండీ.
నా బ్లాగ్ లో నేను అడిగి మరీ రాయించుకున్న మొదటి కామెంట్ మీదే కదా !ఈ క-పిత నా స్వియానుభవం అండీ .ధన్యవాదాలు .

శేఖర్ పెద్దగోపు చెప్పారు...

>>>ఈ క-పిత నా స్వియానుభవం అండీ..

Srinu, who is that unlucky gal...కొంతమంది అంతే...

మీ హరివిల్లు పొదరిల్లు విలువ తెలుసుకుంటారులెండి ఏదో టైంలో..All the best..

చాలా బాగా వ్యక్తపరిచారు.

శ్రీను .కుడుపూడి చెప్పారు...

శేఖర్ గారు!మీరు అన్నట్టుగానే జరిగితే ...మీ కడుపునిండా మా కోనసీమ కొబ్బరి బొండం నీళ్ళు పోస్తానండి.
ధన్యవాదాలండీ .....

భోగిమంట- కథ (సాక్షి ఫన్ డే )

సంక్రాంతికి సొంతూరు అమలాపురం బయలుదేరాము హైదరాబాద్ నుండి. కూకట్ పల్లి బస్టాప్ లో నిలబడ్డాం బస్సుకోసం.పండగ సందడిని పొట్లం కట్టుకుని నింగికి దూ...